Saturday, June 12, 2021

శాసనమండలి ప్రొటెం చైర్మ‌న్‌గా భూపాల్ రెడ్డి

తెలంగాణ‌ శాస‌న‌మండ‌లి ప్రొటెం చైర్మ‌న్‌గా భూపాల్ రెడ్డి నియామ‌కం అయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని ప్రొటెం చైర్మ‌న్‌గా నియ‌మిస్తూ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. శుక్రవారం నుంచి ప్రొటెం చైర్మ‌న్‌గా భూపాల్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. చైర్మ‌న్, డిప్యూటీ చైర్మ‌న్ ప‌ద‌వులు ఖాళీ కావ‌డంతో ప్రొటెం చైర్మ‌న్‌ను గ‌వ‌ర్న‌ర్ నియ‌మించారు. మండ‌లికి చైర్మ‌న్‌ను ఎన్నుకునే వ‌ర‌కు భూపాల్ రెడ్డి ఆ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు.

తెలంగాణ శాసన మండలి నేటితో ఆరుగురు ఎమ్మెల్సీల పదవి కాలం ముగిసింది. మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, డిప్యూటీ చైర్మ‌న్ నేతి విద్యాసాగ‌ర్ ప‌ద‌వీతోపాటు బోడకుంటి వెంకటేశ్వర్లు, ఫరిదోద్దీన్, ఆకుల లలిత, కడియం శ్రీహరిల పదవీ కాలం ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News