Sunday, October 17, 2021

తెలంగాణ ప్రజలు బికారులా?: బండి సంజయ్ పై బాల్క సుమన్ ఫైర్

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రంగా మండిపడ్డారు. బండి సంజయ్ రాసిన లేఖలో విషయం అసలు లేదని, అంతా విషమేనని బాల్క సుమన్ విమర్శించారు. బురదలో బొర్రె పందికి పన్నీరు వాసన తెలీదు అన్నట్లు సంజయ్ చేస్తున్నారని అన్నారు. బడాజూట బండి సంజయ్‌కి ప్రగతిభవన్ ప్రాధాన్యత తెలీదన్నారు. ప్రజలకు అందిస్తున్న పథకాలకు పురుడు పోసిన భవన్.. ప్రగతి భవన్ అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్రమే చెప్పిందని గుర్తు చేశారు.  కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టులు నిర్మించి, తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని చెప్పారు. రాష్ట్రంలోని 4 కోట్లమంది ప్రజలు అందరూ కేసీఆర్ అభిమానులేనన్నారు. తెలంగాణ ప్రజలు బికారులు అన్న మాటలు సంజయ్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతిపక్షాలను ప్రజలంతా కలిసి నిమజ్జనం చేస్తారని జోస్యం చెప్పారు.

ఇది కూడా చదవండి: టీఆర్ఎస్ అవినీతి చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News