Monday, June 5, 2023

20మంది ఎస్‌ఐల బదిలీలు

పెద్దపల్లి, ఏప్రిల్‌ 1 (ప్రభ న్యూస్‌) : రామగుండం కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న 20 మంది సబ్‌ ఇన్స్‌పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్‌ కమిషనర్‌ రెమా రాజేశ్వరి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం సీఎస్‌బీలో పని చేస్తున్న కె.నరేశ్‌ను కన్నేపల్లి పీఎస్‌కు, లక్షెట్టిపేటలో పనిచేస్తున్న కె. ప్రసాద్‌ను దండేపల్లికి, నీల్వాయిలో పనిచేస్తున్న జి. నరేశ్‌ను తాళ్లపల్లి గురిజాలకు, నన్నెల్‌లో పని చేస్తున్న ఎస్‌.రాజశేఖర్‌ను తాండూర్‌కు, గోదావరిఖని వన్‌టౌన్‌లో పని చేస్తున్న పి. సుబ్బారావును నీల్వాయికి, మందమర్రి ఎస్‌ఐ-2గా పని చేస్తున్న కె.మహేందర్‌ను భీమినికి, హాజీపూర్‌లో పనిచేస్తున్న జి. ఉదయ్‌కిరణ్‌ను కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా వీఆర్‌కు, భీమినిలో పని చేస్తున్న ఎస్‌.వెంకటేశ్‌ను గోదావరిఖని వన్‌టౌన్‌కు, కన్నేపల్లిలో పనిచేస్తున్న జి.సురేశ్‌ వర్మను మంచిర్యాల టౌన్‌కు, మంచిర్యాల టాస్క్‌ఫోర్స్‌లో పని చేస్తున్న ఎ.మధుసూదన్ రావును బసంత్‌నగర్‌కు, గోదావరిఖని ఏసీపీ కార్యాలయంలో పనిచేస్తున్న టి.సత్యనారాయణను ధర్మారంకు, దండేపల్లిలో పని చేస్తున్న ఎం.సాంబమూర్తిని మంచిర్యాల సీఎస్‌బీకి, ధర్మారంలో పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్‌ను సీసీఎస్‌ రామగుండంకు, మంచిర్యాల టౌన్‌లో పనిచేస్తున్న డి.కిరణ్‌కుమార్‌ను సీఎస్‌బీ రామగుండంకు, మంచిర్యాల టౌన్‌లో పనిచేస్తున్న జి.హరీశేఖర్‌ను సీఎస్‌బీ రామగుండంకు, గోదావరిఖని వన్‌టౌన్‌లో పనిచేస్తున్న జె.నరేశ్‌కుమార్‌ను హాజీపూర్‌కు, తాళ్ల గురిజాలలో పనిచేస్తున్న జి.రాజశేఖర్‌ను సీసీఎస్‌ మంచిర్యాలకు, తాండూర్‌లో పని చేస్తున్న బి.సమ్మయ్యను సీసీఎస్‌ రామగుండంకు, బసంత్‌నగర్‌లో పని చేస్తున్న టి. శ్రీనివాస్‌ను పీసీఆర్‌ రామగుండంకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement