Saturday, April 20, 2024

Big Breaking | 29 మంది ఐపీఎస్ఎస్ అధికారుల బ‌దిలీ..  ఎవరెవరు ఏ పోస్టుల్లో ఉన్నారంటే..

తెలంగాణ‌లో భారీగా ఐపీఎస్ ఆఫీస‌ర్ల బ‌దిలీ జ‌రిగింది. ఇవ్వాల రాత్రి దీనికి సంబంధించిన జీవోని ప్రభుత్వం విడుద‌ల చేసింది. ఒకేసారి 29 మంది ఐపీఎస్ అధికారుల బ‌దిలీ జ‌ర‌గ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది. కాగా ఇందులో సైబరాబాద్​ సీపీగా ఉన్న స్టీఫెన్​ రవీంద్ర సైబ‌ర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్‌గా కొత్త పోస్టును క్రియేట్​ చేశారు. ఇక.. అడిషనల్​ డీజీగా ఉన్న రాజీవ్​ రతన్ తెలంగాణ పోలీస్​ హౌసింగ్​ కార్పొరేషన్​ మేనేజింగ్​ డైరెక్టర్​గా,  సిటీ సీపీగా ఉన్న ​సీవీ ఆనంద్​ నార్కొటిక్​ బ్యూరో అడిషనల్ డీజీగా, రోడ్డు, రైల్వే శాఖ డీజీగా ఉన్న సందీప్​ శాండల్య టీఎస్​పీఏ డీజీగా, గ్రేహౌండ్స్​ అడషనల్​ డీజీగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్​రెడ్డి.. ఆర్గనైజేషన్​ లీగల్​ డీజీగా..

పర్సనల్​ డీజీగా ఉన్న బి. శివధర్​రెడ్డి రైల్వేస్​, రోడ్డు సేఫ్టీ డీజీగా, బెటాలియన్​ అడిషనల్​ డీజీగా ఉన్న అభిలాష్​ బిస్త్​  హోంగార్డ్స్​ ఏడీజీగా, ఏసీబీ డైరెక్టర్​గా ఉన్న  షికా గోయల్​​ అడషనల్​ డీజీ షీ టీమ్స్​.. ఎస్​ఎల్​పీఆర్​బీ చైర్మన్​గా ఉన్న వి. శ్రీనివాసరావు.. పోలీసు కంప్యూటర్స్​ అడషనల్​ డీజీగా,  షీటీమ్స్​ అడషనల్​ ఏడీజీగా ఉన్న స్వాతి లక్రా టీఎస్​ ఎస్​పీ బెటాలియన్స్ ఏ డీజీగా, వెయిటింగ్​లో ఉన్న విజయ్​కుమార్​ గ్రేహౌండ్స్​ అండ్​ ఆక్టోపస్​ ఏడీజీగా.. నార్త్​ జోన్​ అడషనల్​ డీజీగా ఉన్న వై నాగిరెడ్డి డిజాస్టర్​ రెస్పాన్స్​ అండ్​ ఫైర్​ సర్వీసెస్​ డీజీగా, వెయిటింగ్​లో ఉన్న విక్రమ్​సింగ్​ మాన్​ ఎల్​ అండ్​ ఓ అడిషనల్​ కమిషనర్​గా బదిలీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement