Thursday, April 25, 2024

ట్రైన్ కొలిజన్ అవైడింగ్ సిస్టమ్ ట్రయల్స్.. మార్చి వరకు కంప్లీట్ చేస్తారట..

తాండూరు, ప్రభన్యూస్‌: దక్షిణ మద్య రైల్వేశాఖలో దేశంలోనే మొదటి సారిగా నిర్వహిస్తున్న టీకాస్ (ట్రైన్‌ కొలిజన్‌ అవైడింగ్‌ సిస్టమ్‌) ట్రయల్‌ ప్రయోగాలు వచ్చే యేడాది మార్చిలోగా పూర్తి కాబోతున్నాయని ఆశాఖ జీఎం గజానన్‌ మాల్య పేర్కొన్నారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులోని రైల్వే స్టేషన్‌ను ఆయన సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పర్యటించి స్టేషన్‌లో పలు విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే శాఖ పరిధిలో రైల్వే ప్రమాదాల నియంత్రణలో భాగంగా చేపడుతున్న టీకాస్‌ ప్రయోగాలు 1200 కిలో మీటర్ల పరిధిలో కొనసాగుతున్నాయని తెలిపారు.

వచ్చే యేడాది మార్చిలోగా పూర్తి కాబోతున్నాయని, ఆ తరువాత దేశ వ్యాప్తంగా టీకాస్‌ అమలయ్యే అవకాశం ఉందన్నారు. దీంతో పాటు రైల్వే శాఖ పరిధిలో కరోనా మొదటి, రెండో దశలో రైల్వే ప్రయాణి కులకు మెరుగైన సేవలను అందించడం జరిగిందన్నారు. రైల్వే శాఖ పరిధిలో 90 శాతం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడిపి స్తుండగా.. 70 శాతం మాత్రమే ప్యాసింజర్‌ రైళ్లను నడిపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజా ప్రతినిధులు సైతం చేస్తున్న డిమాండ్లపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీఆర్‌ఎం అజయ్‌ గుప్త, రైల్వే అధికారులు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement