Monday, December 9, 2024

తెలంగాణ సీఎస్ సోమేశ్ ఏపీ క్యాడర్ వ్యక్తి

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌పై టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్ తెలంగాణ లో కొనసాగే అర్హత లేదని రేవంత్ అన్నారు. సోమేశ్ కుమార్ ఏపీ కేడర్‌ వ్యక్తి అని చెప్పారు. ఐఏఎస్ అధికారిగా ఉన్న సోమేశ్ కుమార్ ఉద్యోగం వదిలి బయట ఉద్యోగం చేశారని అన్నారు. ఉద్యోగం వదిలి మళ్ళీ వస్తే 8 ఏళ్ళు విధులను తొలగించాలన్నారు. కేసీఆర్ చెప్పినట్లు సోమేశ్ కుమార్ చేస్తుండు కాబట్టే సోమేశ్ కుమార్ సీఎస్ గా ఉన్నారని వ్యాఖ్యానించారు. భూ కుంభకోణంలో సీఎస్ సోమేశ్ కుమార్ పాత్ర ఉందని రేవంత్ ఆరోపించారు. సోమేశ్ కుమార్ పై కోర్టులో కేసు ఉందని, ఆ కేసు ఫైల్ కనిపించడం లేదన్నారు. సోమేశ్ ఏపీకి వెళ్లాలని క్యాట్ తీర్పు ఇచ్చినా ఆయనను సీఎం కేసీఆర్ సీఎస్‌గా కొనసాగిస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు

ఇది కూడా చదవండి: మోదీతో పవార్ చర్చించిన అంశాలేంటి?

Advertisement

తాజా వార్తలు

Advertisement