Friday, April 19, 2024

ప్రగతి భవన్.. కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయమా?: రేవంత్

కరోనా స‌మ‌యంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కాంట్రాక్ట్‌ నర్సులను ప్రభుత్వం తొలగించడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కరోనా సమయంలో దేవుళ్లని పొగిడిన స్టాఫ్ నర్సులు ఇయ్యాల రోడ్డున పడి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రగతి భవన్.. ప్రజల కన్నీళ్లు తుడవాల్సిన ముఖ్యమంత్రి కార్యాలయమా లేక, కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయమా కేసీఆర్? 1600 మంది స్టాఫ్ నర్సులను విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాను’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

కాగా, తమను ప్రభుత్వం అన్యాయంగా విధుల నుంచి తొలగించిందంటూ కాంట్రాక్ట్‌ నర్సులు నిన్న‌ హైదరాబాదులో డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తుండగా పోలీసుల అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు నర్సులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు చర్యపై మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement