Saturday, May 28, 2022

క్రీడ‌ల‌కు తెలంగాణ‌లో టాప్ ప్ర‌యారిటీ.. క‌రీంన‌గ‌ర్‌లో ఇండోర్ స్టేడియం ప్రారంభం..

తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్ లో ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించారు ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్‌. స్కెటింగ్, షటిల్ , బాస్కెట్ బాల్ ఈవెంట్స్ ను లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లతో క‌లిసి విలేక‌రుతో మాట్లాడారు.

అభివృద్ధిని విస్మరిస్తున్న బిజెపి నేతలు.. రాష్ట్ర ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారు. అభివృద్ధి లో రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా దూసుకుపోతున్నది. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ బాగా అభివృద్ధి చెందింది. రాష్ట్రానికి వచ్చిన బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, మాజీ సీఎంల రాష్ట్రాలతో తెలంగాణను పోల్చితే కనీస దరుదాపుల్లో కూడా లేవు. చర్చకు మేము రెడీ రవీంద్రభారతికి రండి అంటే ఇప్పటి వరకు బీజేపీ నాయకులు స్పందించలేదు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడ లేవు. కేంద్ర ప్రభుత్వ అధికారులను అడగండి మా అభివృద్ధి ఎలా ఉందో చెపుతారు.

బీజేపీ నాయకులు బండి సంజయ్ కరీంనగర్ లో తప్పుడు ప్రచారాలు చేసి ఎంపీ గా గెలిచారన్నారు వినోద్‌కుమార్‌. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇదీ టీఆర్ఎస్ దక్షత. రాష్ట్రం నుంచి గెలిచిన నలుగురు ఎంపీ లు నయా పైసా తేలేదు. బీజేపీ నాయకులు అభివృద్ధి పై దృష్టి సారించాలి. రాజకీయాలు ఎన్నికల సమయంలో మాత్రమే చేయాలి. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి రాష్ట్ర ప్రభుత్వం విశేషం గా కృషి చేస్తోంది. అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement