Thursday, March 28, 2024

Big Story: తెలంగాణ యాస.. డీ గ్లామరస్ పాత్రలు.. టాలీవుడ్ కి ఇప్పుడివే ట్రెండ్..

సినిమా వాళ్ల సెంటిమెంట్ అంతా ఇంతా కాదు. ఏదైనా ఓ సనిమా సూపర్ డూపర్ హిట్టు అయ్యిందంటే చాలు.. ఇక అదే ఫార్ములాని పట్టుకుని తెగ ఫాలో అయిపోతుంటారు. ఒకప్పుడు తెలంగాణ భాష అంటే చాలా చీప్ గా చూసేవారు. అట్లాంటిది ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కంప్లీట్ గా తెలంగాణ స్లాంగ్ నే ఉపయోగిస్తున్నారు. అట్లాంటి సినిమాలన్నీ సూపర్ హిట్టు అందుకుంటున్నాయి. అంతే కాకుండా ఈ మధ్య జై భీమ్ సినిమాలో ప్రతీ క్యారెక్టర్ ఈ సో కాల్డ్ గ్లామర్ వరల్డ్ నుంచి జనాలను చాలా దూరం తీసుకెళ్లాయి. అయినా ఆ పాత్రలు.. వారి ఆటిట్యూడ్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యింది.

జైభీమ్ మూవీ బంపర్ హిట్టు అయ్యింది. ఇప్పుడా మూవీ ఆస్కార్ కూడా ఎంపికైంది. దీంతో ఈ మూవీ విజయం సినీ ఫీల్డ్ పై చాలా ఎఫెక్ట్ చూపిందనే అనుకోవాలి. సినిమా అంటేనే ఊహాలోకంలో విహరింపజేసే ఓ అద్భతమైన కల లాంటిది. కానీ, జైభీమ్ మూవీ కొన్ని ఫార్ములాలను పక్కనపెట్టి జనాలను వాస్తవ లోకంలోకి తీసుకొస్తుంది. తాము అనుభవించిన ఎన్నో అంశాలు ఈ మూవీలో ఉండడంతో అందరికి బాగా కనెక్ట్ అయ్యింది ఈ సినిమా. అది సాధించిన విజయంతో టాలీవుడ్ కూడా డీ గ్లామరస్ కేరెక్టర్లతో మూవీస్ తీయడానికి రెడీ అవుతోంది.

ఈ మధ్య రిలీజైన పుష్ప సినిమాలో కూడా హీరో అల్లు అర్జున్ కొంత డీ గ్లామరస్ గానే కనిపిస్తాడు. ఓ ఎర్రచందనం స్మగ్లర్ ఎట్లా ఉంటాడో పక్కాగా అట్లాగే చూపించారు.  డైరెక్టర్ సుకుమార్ స్మగ్లర్ హీరోయిజాన్ని ఎలివేట్  చేసిన తీరు నేచురల్ గానే ఉంటుంది. సినిమాలో హీరోయిన్ రష్మిక కూడా డీ గ్లామరస్ రోల్ లోనే కనిపిస్తుంది. దీంతో అటు మాస్.. ఇటు క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా సినిమా నడిపించడంలో దర్శకుడు ప్రత్యేకంగా వర్క్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మీదట తెలుగు సినీ ఇండస్ట్రీలో డీ గ్లామరస్ క్యారెక్టర్లకు ఇంపార్టెన్స్ పెరుగుతుందని అంతా అనుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలోనే రిలీజై మంచి టాక్ తెచ్చుకున్న కొండపొలం మూవీలో కూడా హీరో, హీరోయిన్లు డీ గ్లామరస్ క్యారెక్టర్లతోనే ఉంటారు. ఆ మూవీ కూడా బాగానే ప్రజలను ఆకట్టుకుంది. అయితే.. డీ గ్లామరస్ పాత్రలు సాధారణ జనానికి చాలా దగ్గరగా ఉంటాయి. వారి నెటివిటీకి తగ్గట్టు ఉండడంతో ఆదరణ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. తమ మధ్య ఉన్న వ్యక్తిగానే జనం ఫీలవుతుంటారు. అందువల్లనే అట్లాంటి పాత్రలకు క్రేజ్ వస్తుంది.

కథా బలంతో పాటు డీ గ్లామర్ ఓరియంటెడ్ గా వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్టు అయ్యాయి.  అదే స్థాయిలో తెలంగాణ యాస కూడా ఈ మద్య వస్తున్న సినిమాల్లో ఎక్కువగా ఉంటోంది. ఒకప్పుడు కామెడీ క్యారెక్టర్లకు మాత్రమే పరిమితం చేసే తెలంగాణ స్లాంగ్ ను ఇప్పుడు హీరో, హీరోయిన్లకు వాడుతున్నారు. ఈ ట్రెండ్ చాలా సినిమాల నుంచి కొనసాగుతోంది. అట్లాంటి సినిమాలన్నీ బాక్సాపీస్ ను వద్ద బంపర్ హిట్టు కొడుతూ సినీ పరిశ్రమకు మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి.  ఇక మీదట డీ గ్లామరస్ ఓరియెంటెడ్ రోల్స్ తో పాటు.. తెలంగాణ స్లాంగ్ కూడా టాలీవుడ్ కి కీలక పాయింట్ కానుంది. ఇవే ఈ తరం జనాలకు ట్రెండ్ సెట్టర్ గా మారుతున్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్ పే జీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement