Thursday, April 25, 2024

Big Breaking | సంగారెడ్డి జిల్లాలో రెండుచోట్ల పిడుగులు.. ఆందోళ‌న‌లో రైతులు

చౌట్కూర్, (ప్రభన్యూస్): సంగారెడ్డి జిల్లాలో రెండు చోట్ల ఇవ్వాల (శుక్ర‌వారం) పిడుగుప‌డింది. దీంతో ఓ ఎద్దు చ‌నిపోయింది. ఈ ఘ‌ట‌న చౌటకూర్ మండలం లోని జ‌రిగింది. రెండు పిడుగులు వేర్వేరు ప్రాంతాల్లో ప‌డ‌డంతో స్థానికులు, రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. ఇవ్వాల సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మండల కేంద్రంలోని వ్యవసాయ పొలంలో పిడుగు ఎద్దుపై పడింది. మరొకటి కొర్పోల్ గ్రామంలో కొబ్బరి చెట్టుపై పడింది.

చౌటాకూర్ గ్రామానికి చెందిన చాకలి లక్ష్మయ్య అనే రైతు రోజు మాదిరిగానే ఎడ్లను తీసుకొని వ్యవసాయ పనుల నిమిత్తం తన పొలానికి వెళ్ళాడు. అదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ప‌డింది. అంత‌లోనే ఒక్కసారిగా భారీ శబ్దంతో ఎద్దుపై పిడుగు పడింది. దీంతో ఎద్దు అక్కడికక్కడే చ‌నిపోయిన‌ట్టు లక్ష్మయ్య తెలిపాడు. ఎద్దు మృతితో దాదాపు రూ. 80 వేల నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. ఇదిలా ఉండగా.. మండలంలోని కోల్పోల్ గ్రామంలో కొబ్బరి చెట్టుపై మ‌రో పిడుగు పడడంతో కొబ్బరి చెట్టు పూర్తిగా కాలిపోయింది. అయితే ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి అపాయం జరగలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement