Tuesday, October 8, 2024

TG: గోదావరి నదిలో మునిగిన ముగ్గురు.. ఒకరు మృతి..

ఒకరిని కాపాడిన జాలర్లు.. అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలింపు
మరొకరి కోసం గాలింపు
ధర్మపురి, ఆంధ్రప్రభ : గోదావరి నదిలో ముగ్గురు మునిగిపోయిన సంఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపట్నం గోదావరి నది వంతెన వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు నదిలో స్నానానికి దిగి నీటిలో మునిగిపోయారు.

నదిలో ఒక మృతదేహం లభ్యమైంది. మరో యువకుడిని జాలర్లు, పరిసర వాసులు కాపాడారు. యువకుడు అపస్మారక స్థితిలో ఉండగా, జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. దుర్గా దీక్షలో ఉన్నవారు స్నానానికి వచ్చినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement