Thursday, December 5, 2024

KNR | ఆ అధికారులది పెద్ద మనసు..

  • మిత్రుడి కుటుంబానికి ఆర్థిక చేయూత
  • రూ. నాలుగు లక్షల విరాళం


కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : 2009 బ్యాచ్ పోలీస్ అధికారులు మరోసారి పెద్దమనను చాటుకున్నారు. 2007 బ్యాచ్ కి చెందిన పోలీస్ అధికారి ఇటీవల మృతిచెందగా వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచారు. 2007 ఎస్ఐ బ్యాచ్ కు చెందిన సైరీ రాజేష్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబానికి మంగళవారం 4లక్షల రూపాయల విరాళం అందజేశారు.

2009 బ్యాచ్ లో ఎస్ఐలుగా ఎంపికైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పోలీస్ అధికారులు గత కొన్నేళ్ల క్రితం వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసుకొని ఆపద సమయంలో పోలీస్ మిత్రులకు చేదోడుగా నిలుస్తున్నారు. శాఖ పరంగా ఇబ్బంది తలెత్తిన సమయంతో పాటు ఆపద సమయంలో అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఎందరో మిత్రుల కుటుంబాలకు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. తాజాగా మృతుడు రాజేష్ కుటుంబానికి అండగా నిలవడంతో కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు ప్రదీప్ కుమార్, పర్శ రమేష్, కోటేశ్వర్, లక్ష్మీనారాయణ, స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement