Saturday, April 20, 2024

ఈనెల 17 సీఎం కేసీఆర్ పుట్టినరోజు – సైకిల్ యాత్ర చేపట్టిన ‘పిడిశెట్టి రాజు’

కరీంనగర్ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుతూ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఓడితల సతీష్ కుమార్, బీసీ మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆశీస్సులతో కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు, కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వరకు సైకిల్ యాత్రని చేప‌ట్టారు. ఈ యాత్ర‌కి తెలంగాణ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ తెలంగాణ చౌక్ వ్యవస్థాపకుడు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ వినోద్ కుమార్ యువసేన రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ,జిఎస్ ఆనంద్ జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాలుగు కోట్ల మందితో ఉద్యమం నడిపి ఢిల్లీ పెద్దల్ని ఓపించి మెప్పించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన గొప్ప పోరాట యోధుడు కేసీఆర్ అని జిఎస్ ఆనంద్ అన్నారు, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంను బంగారు తెలంగాణ సాధన కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప మహనీయుడు అపర భగిరదుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని. జిఎస్ ఆనంద్ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement