Saturday, June 3, 2023

త్వరలో కరీంనగర్ మెడికల్ కాలేజీ పనులు పూర్తి.. మంత్రి గంగుల

అతి త్వ‌ర‌లో కరీంన‌గ‌ర్ మెడిక‌ల్ కాలేజీ ప‌నులు పూర్తవుతాయ‌ని రాష్ట్ర మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు. రాష్ట్రంలో వైద్య కళశాలల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. గత సంవత్సరం ప్రారంభించిన కాలేజీలకు అధనంగా మరో 9 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్న విషయం విధితమే. వీటిలో కరీంనగర్ మెడికల్ కాలేజీకి సంబంధించిన అంశంపై మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు నిర్వహించిన వీడియో కాన్సరెన్స్ లో హైదరాబాద్లోని తన అధికారిక నివాసం నుండి పాల్గొన్న మంత్రి గంగుల మాట్లాడుతూ… ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఉన్నసాకును చూపి కరీంనగర్ కు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయకున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మెడికల్ కాలేజీని మంజూరు చేసారని, జిల్లా ప్రజల తరపున తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసారు మంత్రి గంగుల కమలాకర్.

- Advertisement -
   

ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రత్యేక కృషితో త్వరితగతిన పనులు జరుపుతున్నామని, 500 బెడ్లకు సరిపోయే విధంగా కొత్తపల్లిలో టీఎస్ఎస్ డిసి గోడౌన్లను మెడికల్ కళాశాలకు అప్పగించడమే కాకుండా వాటిలో అవసరమైన నిర్మాణాలను శరవేగంగా చేపడుతున్నామన్నారు. విద్యార్థుల వసతికి హాస్టళ్లను సైతం గుర్తించామన్నారు. పూర్తి జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా సమన్వయంతో పనులు చేపడుతున్నామన్న మంత్రి ఎట్టిపరిస్థితుల్లోనూ రాబోయే విద్యాసంవత్సరంలో క్లాసులు ప్రారంభించేవిధంగా చర్యలు తీసుకుంటామ‌ని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement