Friday, April 19, 2024

కార్మికుల హక్కుల సాధనకై పోరాటం : ఎమ్మెల్యే కోరుకంటి

ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన ఒప్పందం అమలు చేసే వరకు యాజమాన్యంపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని… ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల హక్కుల సాధనకై విశ్రమించేదే లేదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం ఎన్టీపీసీ లెబర్ గెట్ వద్ద కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన గెట్ మీటింగ్ లో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గోని ప్రసంగించారు. ఎన్ టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల శ్రమను దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

కార్మికుల సమస్యల పరిష్కారం విషయంలో అన్ని కార్మిక సంఘాలు ఏకం కావడం నిజంగా శుభ పరిణామమని ఆయన తెలిపారు. సీనియర్ కార్మికులకు ఇవ్వాల్సిన ప్రమోషన్ ను ఇప్పటివరకు ఇవ్వకపోవడం సరైంది కాదని, కార్మిక చట్టాల ప్రకారం కాంట్రాక్టు కార్మికులకు రావలసిన కనీస వేతనాలతో పాటు ఇతర వసతులను యాజమాన్యం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. సింగరేణిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న కారుణ్య నియమాకాల తరహలో ఎన్టీపీసీలో వారసులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement