Thursday, December 5, 2024

MBNR | కులగణన సర్వేలో అధికారులకు సహకరించాలి.. ఎమ్మెల్యే మేఘా రెడ్డి

వనపర్తి ప్రతినిధి, నవంబర్ 7 (ఆంధ్ర ప్రభ) : కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేలో ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించి పూర్తిస్థాయిలో కుటుంబ వివరాలను నమోదు చేయించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గురువారం తెలిపారు. గ్రామాల్లో అధికారులు చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విధిగా పాల్గొని ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో నమోదయ్యేలా చూడాలని ఎమ్మెల్యే సూచించారు.

వలసలు వెళ్లిన వారి కుటుంబ వివరాలను, డోర్ లాక్ చేయబడి ఉన్న కుటుంబ వివరాలను సైతం నమోదు చేయించాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన జరిగే ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకంగా పాల్గొని తెలంగాణ రాష్ట్రంలోనే వనపర్తి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ అయ్యేవిధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement