Sunday, January 16, 2022

ఓటరు న‌మోదుకు రేపే చివ‌రి తేదీ : లోకేష్ కుమార్

ఈనెల 1వ తేదీన‌ విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు, నూతన ఓటరు నమోదుకు, ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చునని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం 2021 సంవత్సరం ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1న‌ విడుదల చేసిన నేపథ్యంలో ఆ ఓటరు జాబితాలో పేరు, అడ్రస్, తొలగింపు లాంటి మార్పులు చేర్పులు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

అలాగే జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు వయస్సు పూర్తయిన వారు కూడా నవంబర్ 30వ‌ తేదీలోగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నియోజకవర్గ ఈఅర్ఓకు (డిప్యూటీ కమిషనర్ కార్యాలయం) కానీ, www.nvsp.in ఓటరు హెల్ప్ లైన్ యాప్ ద్వారా కానీ నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చునని లోకేష్ కుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయ‌న‌ ప్రజలను కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News