Wednesday, November 6, 2024

TG | గంజాయి మత్తులో వృద్ధురాలిని హత్య చేసిన మనవ‌డు

మేడ్చల్, అక్టోబర్ 19 (ప్రభన్యూస్): గంజాయి మత్తులో వృద్ధురాలిని హత్య చేసిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని రావల్ కోల్ గ్రామానికి చెందిన బందెల బాలమ్మను మనవ‌డు ప్రశాంత్ గంజాయి మత్తులో తలపై కొట్టడంతో వృద్ధురాలు అక్కడికక్కడే చనిపోయినట్లు చెప్పారు.

మృతురాలు బాలమ్మకు ప్రభుత్వం నుండి పెన్షన్ మంజూరైన డబ్బులను ఇవ్వమని మనవడు ప్రశాంత్ వేధించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మృతురాలు బాలమ్మను పెన్షన్ డబ్బుల కోసం తలపై బాద‌డంతో ఆమె అక్కడిక‌క్క‌డే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement