Saturday, November 30, 2024

TG: జాతీయ స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌.. హర్షం వ్యక్తం చేసిన డాక్టర్​ నందకిశోర్​

  • సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతించిన గమన్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్


ఆంధ్రప్రభ స్మార్ట్​, హైద‌రాబాద్‌: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ట్రెయినీ డాక్ట‌ర్‌పై హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టు జాతీయ స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించడం హర్షణీయమని గమన్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్​ నందకిషోర్ యర్రంశెట్టి అన్నారు. దేశ వ్యాప్తంగా వైద్యుల భద్రతకు సూచనలు చేసేందుకు ప్రముఖ డాక్టర్లతో కూడిన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలన్న ఆదేశాలతో సమస్యకు పరిష్కారం లభిస్తుందని.. ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

టాస్క్ ఫోర్స్ సభ్యులుగా డాక్టర్ నాగేశ్వరరావు, ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్‌ లను ఎంపిక చేయడం కూడా సముచితంగా ఉందని ఆయన తెలిపారు. అన్నివర్గాల ప్రజలను, నిపుణులను సంప్రదించి, నేషనల్ టాస్క్ ఫోర్స్ సమగ్ర నివేదిక తయారు చేస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. అన్ని ఆస్పత్రుల్లో సురక్షిత పరిస్థితులను కల్పించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉపయోగపడతాయని, వీలైనంత త్వరగా ఈ టాస్క్ ఫోర్స్ నివేదికను సిద్ధం చేయాలని ఆయన కోరారు. సీనియర్, జూనియర్ డాక్టర్ల భద్రతకు టాస్క్ ఫోర్స్ సమగ్ర సిఫారసులు చేస్తుందని భావిస్తున్నామని, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌లో ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అధిపతి డా.నాగేశ్వర్ రెడ్డి ఉండటం ఆనందం కలిగించిందని నందకిషోర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement