Tuesday, May 30, 2023

Telangana: నెరవేరిన క‌ల్లూరు ప్ర‌జ‌ల క‌ల‌.. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి రూ.21 కోట్లు మంజూరు!

కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రమైన కల్లూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి ప్రభుత్వం 21 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య గురువారం హైదరాబాదులోని ఆరోగ్య మంత్రి హరీష్ రావుని కలిసి శాలువాతో సత్కరించారు. కల్లూరు వైద్య విధాన పరిషత్ హాస్పిటల్ కి 21 కోట్ల రూపాయల నిధులు మంజూరుపై హర్షిస్తూ డివిజన్ ప్రాంత ప్రజల పక్షాన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో సత్తుపల్లిలోని 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో కల్లూరు, పెనుబల్లి మండలాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి తనిఖీ చేశారు.

కల్లూరు ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యే సండ్ర మంత్రి హరీష్ రావుని హాస్పటల్ ను అభివృద్ధి చేయాలని కోరారు. దీంతో కల్లూరు ప్రాథమిక హాస్పటల్ ను వైద్య విధాన పరిషత్ హాస్పటల్ గా మారుస్తున్నట్లు హరీష్ రావు హామీ ఇచ్చారు. అవసరమైతే హాస్పిటల్ పడకల పెంచడానికి, అదనపు గదుల నిర్మాణానికి ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీ మేర‌కు ఇవ్వాల కల్లూరు వైద్య విధాన పరిషత్ అభివృద్ధికి 21 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement