Friday, April 19, 2024

సదర్‌లో దౌడు తీసిన దున్న‌.. స్కూటితో పాటు మహిళను ఈడ్చుకెళ్లింది..

హైద‌రాబాద్‌లో స‌ద‌ర్ ఉత్స‌వాలు చాలా ఫేమ‌స్‌.. యాద‌వులు నిర్వ‌హించే ఈ ఉత్స‌వాల‌ను ప్ర‌భుత్వం అధికారికంగా నిర్వ‌హిస్తోది. ఈ రోజు ఖైరతాబాద్‌లో స‌ద‌ర్ ఉత్స‌వాలు జ‌రిగాయి. దున్న‌పోతు ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హిస్తుండా అనుకోకుండా దున్న అదుపుత‌ప్పింది.

ఖైరాతాబాద్‌ చింతల్‌బస్తీలో ఈ ఘటన జ‌రిగింది. రోడ్డు మీదకు వచ్చిన దున్నపోతు బీభత్సం సృష్టించింది. దానికి ఎదురుగా కనిపించిన వారి మీదకు పరిగెత్తింది. దున్నను కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పటికి వీలు కాలేదు. ఈ క్రమంలో దున్నపోతు స్కూటీతో పాటు ఓ మహిళను ఈడ్చుకెళ్లింది. దున్నపోతు దాడిలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. చివరకు కొందరు యువకులు ఖైరతాబాద్‌ చౌరస్తాలో అదుపుత‌ప్పిన‌ దున్నపోతును పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement