Thursday, December 5, 2024

యువ‌తిని వెంబ‌డించి వేధిస్తున్న యువ‌కుడు.. పోక్సో చ‌ట్టం కింద కటకటాల్లోకి నెట్టిన పోలీసులు

మ‌రిపెడ‌, (ప్ర‌భ న్యూస్‌): మ‌హ‌బుబాబాద్ జిల్లాలో ఓ పోకిరీ వెధ‌వ‌పై పోలీసులు పోక్సో యాక్ట్​ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠ‌శాల‌కు వెళ్తున్న విద్యార్థినిని వేధిస్తున్న ఓ యువ‌కుడిపై బాలిక త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు బుధ‌వారం పోక్సో కేసు న‌మోదు చేసిన‌ట్లు ఎస్‌హెచ్‌వో దూలం ప‌వ‌న్ కుమార్ తెలిపారు. న‌ర్సింహుల‌పేట మండ‌లానికి చెందిన ఓ యువ‌కుడు మ‌రిపెడ మండ‌ల కేంద్రంలోని ఓ పాఠ‌శాలలో చ‌దువుతున్న విద్యార్థినిని రోజూ బైకుపై వెంబ‌డిస్తూ అస‌భ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

చాలా రోజులుగా ఓపిక పట్టిన విద్యార్థిని విసిగిపోయి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌టంతో ఆ పోకిరీ వెధవపై పోలీసులు పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. ఆక‌తాయిలు ఎవ‌రైన సరే.. ఆడపిల్ల‌ల ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తే స‌హించేది లేద‌ని, త‌ల్లిదండ్రుల‌కు కానీ, అమ్మాయిలకు కానీ ఎట్లాంటి అనుమానం కలిగినా పోలీసులకు కంప్లెయింట్​ చేయాలని పోలీసులు తెలిపారు. ఆడ పిల్ల‌లు, మ‌హిళ‌ల, విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలుంటాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement