Wednesday, November 27, 2024

NZB | నదిలో యువతి మృతదేహం లభ్యం..

నిజామాబాద్ ప్రతినిధి, నవంబర్7 (ఆంధ్రప్రభ) : బాసర గోదావరి నదిలో గల్లంతైన పూర్ణిమ మృతదేహం గురువారం లభ్యమైంది. నిజామాబాద్ కు చెందిన వేణు కుటుంబీకులు వడ్డీ వ్యాపారుల వేధింపులతో బుధవారం బాసర గోదావరి నదిలో దూకారు. ఇందులో వేణు మృతిచెందగా మృతదేహం లభ్యమైంది. కాగా అతడి కూతురు పూర్ణిమ నదిలో గల్లంతు కాగా, పోలీసులు గజ ఈతగాళ్ళతో గాలింపు చర్యలు చేపట్టాగా ఈరోజు యువతి మృతదేహం లభ్యమైంది. మృతదేహాలను స్థానిక ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. వేణు భార్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై బాసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పాపం పూర్ణిమ…
నిజామాబాద్ నగరంలోని నాల్కల్ రోడ్డు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఉప్ప లంచ వేణు అనురాధ దంపతుల గారాల పట్టి పూర్ణిమ. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. ఎంతో కష్టపడి కన్న కూతురిని చదివించారు. మంచి అబ్బాయిని చూసి కూతురికి వివాహం చేసి కూతురి జీవితంపై ఎన్నో కలలు కన్నా ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరయ్యాయి. వడ్డీ వ్యాపారి ఘాతుకానికి తండ్రీ కూతుళ్లు బలయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement