Tuesday, May 30, 2023

Telangana: బీజేపీ నేతల తీరు చాలా దుర్మార్గం.. ఎమ్మెల్సీ క‌విత‌కు మంత్రి పువ్వాడ సంఘీభావం

టీఆర్ ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ నేతలు దాడి చేయడం చాలా దారుణమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్సీ కవితను అజయ్ కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ బీజేపీ నేతలు ఇలాంటి పనులు చేయడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ పార్టీకి లక్షల మంది కార్యకర్తలున్నారు అని వారు మీ ఇండ్లమీదికి, పార్టీ ఆఫీసుల మీదకు వస్తే మీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అయినా తాము ఎంతో సహనంతో ఉన్నామని మంత్రి అజయ్ అన్నారు.

- Advertisement -
   

బీజేపీ నేతల వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. క‌విత‌ను క‌లిసిన వారిలో ఆలేరు ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement