Monday, January 30, 2023

Breaking: అదే నా ఏకైక ఏజెండా.. పోరాటం ఆగ‌దన్న కోమటిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రాన్ని సొంత ఆస్తిలా మార్చుకున్న సీఎం కేసీఆర్ మీద పోరాటం చేయ‌బోతున్నాన‌ని, మునుగోడు అభివృద్ధే త‌న ఏకైక ల‌క్ష్యంగా ముందుకు వెళ్తాన‌ని పేర్కొన్నారు ఎమ్మెల్యే రాజ‌గోపాల్‌రెడ్డి. ఈ మేర‌కు ఆయ‌న ఇవ్వాల (శుక్ర‌వారం) మీడియాకు ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంపై క‌క్ష్య‌క‌గ‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, ఎస్ ఎల్‌బీసీ, బ్రాహ్మ‌ణ వెల్లంల ప్రాజెక్టుల‌తో పాటు ప‌లు అభివృద్ది ప‌నులు ఆగిపోయాయ‌న్నారు. మూడున్న‌రేళ్లుగా త‌న‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఎన్నో అవ‌మానాలు భ‌రించార‌ని, ఇక త‌న‌కు స‌హ‌నం లేద‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు త‌న‌వెంటే ఉన్నార‌ని, స‌మ‌ర‌శంఖం పూరించ‌బోతున్న‌ట్టు తెలిపారు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి. ఇది ప‌ద‌వుల కోసం చేస్తున్న పోరాటం కాద‌ని, ప్ర‌జ‌లు త‌న‌ను ఆశీర్వ‌దిస్తార‌న్న న‌మ్మ‌కంతోనే యుద్ధానికి దిగుతున్నాన‌ని వెల్ల‌డించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement