Wednesday, April 24, 2024

పల్లె ప్రగతిలో ఆ గ్రామం అందరికీ ఆదర్శం.. అట్లా చేస్తేనే మంచిద‌న్న‌ కేటీఆర్

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండ‌లంలోని ముఖ్రా కె గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన సర్పంచ్‌ గాడ్గె మినాక్షిని మంత్రి కేటీఆర్ అభినందించారు. ముఖ్రా కె గ్రామంలొ తడి చెత్త ద్వారా 6 ల‌క్ష‌ల‌ ఆదాయాన్ని సంపాందించడంపౌ సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రతి ఇంటికి చేరిన కేసీఆర్ సంక్షేమ పథకాలు, ప్రతి ఇంటికి ఏఏ సంక్షేమ నిధులు అందాయో వివరాలతో ఫ్లెక్సి బోర్డ్ పెట్టడం, గ్రామంలొ జరిగిన అభివృద్ధి ప‌నుల‌ బోర్డ్ పెట్టడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ముఖ్రా కె గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ పథకాలను విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ముఖ్రా కె ఎంపీటీసీ గాడ్గె సుభాష్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement