Friday, April 19, 2024

హేళ‌న చేసిన చోటే కీర్తి.. తెలంగాణ యాస‌పై కేటీఆర్ ట్వీట్

ఒక‌ప్పుడు తెలంగాణ యాస‌ను హేళ‌న చేసిన చోటే ఇప్పుడు కీర్తి ద‌క్కుతుంద‌న్నారు మంత్రి కేటీఆర్. తెలుగు సినిమాల్లో తెలంగాణ సంస్కృతి , సంప్ర‌దాయాల‌కు పెద్ద‌పీట వేస్తూ, ఈ ప్రాంత యాస‌లో చిత్రీక‌రిస్తున్న సినిమాల‌పై మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ధ‌న్య‌వాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక రంగంలో పున‌రుజ్జీవ‌నానికి కార‌ణ‌మైన కేసీఆర్‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు. డియ‌ర్ స‌ర్(కేటీఆర్‌ను ఉద్దేశించి).. మీతో నేను ఓ రెండు విష‌యాలు పంచుకోవాల‌నుకుంటున్నాను. అందులో ఒక‌టి.. ఈ విష‌యాన్ని మీతో పంచుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ యాస‌లో ఇప్పుడు సినిమాలు రావ‌డం, అవి అద్భుతంగా ప్ర‌జాద‌ర‌ణ పొంద‌డం చూస్తుంటే సంతోషంగా ఉంది. ఉదాహ‌ర‌ణ‌కు బ‌లగం , ద‌స‌రా లాంటి సినిమాలు. ఈ క్రెడిట్ అంతా కేసీఆర్‌కే ద‌క్కుతుంది.ఇక రెండో విష‌యం ఏంటంటే.. నాకు 68 ఏండ్లు.. ఇలాంటి సినిమాలు వ‌స్తాయ‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేదు. తెలుగు సినిమాల్లో తెలంగాణ వారిని విల‌న్లు, జోక‌ర్స్ గా చూపిచండంతో.. గ‌త 20 ఏండ్ల నుంచి సినిమా థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం మానేశాను అని డాక్ట‌ర్ దండే శ్రీరాములు అనే వ్య‌క్తి కేటీఆర్‌కు వాట్సాప్ ద్వారా సందేశం పంపారు. ఈ సందేశంపై కేటీఆర్ స్పందిస్తూ.. సర్ మీ అభిప్రాయాన్ని నేను ట్వీట్ చేయొచ్చా.. అని అడిగారు. అది కూడా మీ అనుమ‌తితో అని కేటీఆర్ అడ‌గ్గా.. శ్రీరాములు కూడా పాజిటివ్‌గా స్పందించారు. స‌ర్ త‌ప్ప‌కుండా.. మీరు ట్వీట్ చేస్తే నేను ఎంతో హ్యాపీగా ఫీల‌వుతాను. మీరు మ‌మ్మ‌ల్ని అడ‌గ‌డం మీ మంచిత‌నానికి నిద‌ర్శ‌నం. థాంక్యూ వెరి మ‌చ్ స‌ర్ అంటూ శ్రీరాములు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement