Sunday, December 1, 2024

TGSRTC | కురుమూర్తి స్వామి జాత‌రకు ప్ర‌త్యేక బ‌స్సులు !

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రసిద్ధ క్షేత్ర‌మైన శ్రీ కురుమూర్తి స్వామి జాతరకు వెళ్లే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఈ మేర‌కు సంస్థ ఎండీ స‌జ్జ‌నార్ తెలిపారు.

కురుమూర్తి జాత‌రలో ప్ర‌ధాన ఘ‌ట్ట‌మైన ఉద్దాల ఉత్స‌వం నవంబర్ 8వ తేదిన జ‌ర‌గ‌నుంది. దీంతో 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. ఈ నేప‌థ్యంలో ఆయా రోజుల్లో ప్ర‌త్యేక బ‌స్సులను హైద‌రాబాద్ నుంచి సంస్థ అందుబాటులో ఉంచుతోందని స‌జ్జ‌నార్ వెల్ల‌డించారు.

ఎంజిబీఎస్ నుండి ఆరంగర్, మహబూబ్ నగర్ మీదుగా బస్సులు కురుపుర్తి జాతరకు వెళ్తాయి. ఆర్టీసీ సంస్థ ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లు కల్పిస్తోంది. టికెట్ బుకింగ్ కోసం http://tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement