Thursday, December 5, 2024

TG – శృంగేరి పిఠానికి వేముల‌వాడ ఆల‌య బృందం…

హైద‌రాబాద్ – ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరస్వామి వారి దేవాలయ ఆభివృద్ది పనులు చేప‌ట్టే విష‌యంలో అనుస‌రించాల్సిన విధివిధానాలు చ‌ర్చించేందుకు శృంగేరి పీఠానికి ఉన్నత స్థాయి బృందం చేరుకుంది.

ఈ బృందంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ది శ్రీనివాస్, ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి((ఓఎస్డీ) వేముల శ్రీనివాసులు, రాజన్న దేవస్థానం ఈవో వినోద్ రెడ్డి, దేవాదాయ శాఖ స్థపతిశ్రీ వల్లీనాయగం, శృంగేరి పీఠం తెలంగాణ భాధ్యులు రాధాకృష్ణ , దేవస్థానం అధికారులు, అర్చకులు ఉన్నారు.

- Advertisement -

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ప్రజాప్రభుత్వం వార్షిక బడ్జెట్ లో రూ.50 కోట్ల నిధులు కేటాయించడం తెలిసిందే. వేములవాడ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఆలయ అర్చకులు, అధికారులు ఆగస్టు 30న సచివాలయంలో ముఖ్యమంత్రి ని కలిసిన సందర్భంలో శృంగేరి పీఠం అనుమతి అంశం చర్చకు రాగా, వెంటనే అక్క‌డ‌కు వెళ్లాల్సిందిగా సిఎం ఆదేశించారు. ఈ మేరకు ఉన్నత స్థాయి బృందం శృంగేరి వెళ్లింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement