Friday, September 13, 2024

TG – ఆడుకుంటున్నారనుకుంటే … అనంత‌లోకాల‌కు వెళ్లారు…

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : పిల్ల‌లు ఇద్ద‌రు ఆడుకుంటున్నార‌ని అనారోగ్యంతో ఉన్న త‌ల్లి అలా ప‌డుకుంది. ఇంత‌లోనే ఆ పిల్ల‌లు ఇద్ద‌రూ ఆడుతూ నీటి తొట్టె వైపు వెళ్లారు. అందులో ప‌డిపోయారు. అయితే కుటుంబ స‌భ్యులు గ‌మ‌నించి బ‌య‌ట‌కు తీసీ ఆస్ప‌త్రిలో చేర్పించారు. అప్ప‌టికే వారిద్ద‌రు మృతి చెందార‌ని డాక్ట‌ర్లు నిర్ధారించారు. ఇదీ నారాయ‌ణ‌పేట జిల్లా గుండుమాల్ మండ‌లం బ‌లభ‌ద్రాయిప‌ల్లి గ్రామంలో జ‌రిగింది.

గ్రామంలో విషాద‌ఛాయ‌లు
బలభద్రాయపల్లి గ్రామానికి చెందిన న‌ర్సింహులు పొలానికి వెళ్ల‌గా.. త‌ల్లి క‌విత అనారోగ్యంతో ప‌డుకున్నారు. అదే స‌మయంలో కుమారులు నిహ‌న్స్ (3), భానుమూర్తి (2) అడుకుంటున్నారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న త‌ల్లి వీరి ఆడుకుంటున్నార‌ని అనుకుని ప‌డుకున్నారు. ఇంత‌లో వీరిద్ద‌రూ ఇంటి ముందు ఉన్న నీటి తొట్టిలో ప‌డ్డారు. అయితే గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు బ‌య‌ట‌కు తీసి ఆస్ప‌త్రికి తీసుకు వెళ్లారు. అప్ప‌టికే ఇద్ద‌రు మృతి చెందార‌ని డాక్ట‌ర్లు తెలిపారు. వీరి మృతితో త‌ల్లిదండ్రుల రోద‌న‌లు మిన్నంటాయి. ఆ గ్రామంలో విష‌ద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

- Advertisement -

ఇదే త‌ర‌హాలో…
మహబూబ్ నగర్ జిల్లా రుసుంపల్లికి చెందిన శ్రీహరి, లలిత దంపతుల కుమార్తె గౌతమి(2)ని ఇంట్లో అమ్మమ్మ, తాత దగ్గర వదిలి పొలం పనులకు వెళ్లారు. అయితే ఆ చిన్నారి ఆడుకుంటుంద‌ని ప‌నుల్లో వారు నిమ‌గ్న‌మయ్యారు. ఆడుకుంటూ నీటిలో ఆ చిన్నారి ప‌డి మృతి చెందింది. మృతి చెందిన చిన్నారి చూసి త‌ల్లిదండ్రులు రోదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement