Friday, January 17, 2025

TG – ఆ కేసును కొట్టేయండి … హైకోర్టులో హ‌రీశ్ రావు పిటిష‌న్ ….

హైద‌రాబాద్ : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. పంజాగుట్ట పోలీసు స్టేష‌న్‌లో న‌మోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాల‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. పంజాగుట్ట పీఎస్‌లో త‌న‌పై త‌ప్పుడు కేసు న‌మోదు చేశార‌ని అన్నారు. రాజ‌కీయ దురుద్దేశంతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు న‌మోదు చేశార‌ని ఆయ‌న తెలిపారు. త‌న ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ‌తీసేందుకే త‌ప్పుడు కేసులు న‌మోదు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఎఫ్ఐఆర్‌పై ముందుకు వెళ్ల‌కుండా స్టే ఇవ్వాల‌ని కోర్టును కోరారు. సిద్దిపేట కాంగ్రెస్ నేత చ‌క్ర‌ధ‌ర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హ‌రీశ్‌రావుపై పంజాగుట్ట పి ఎస్ లో కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement