Wednesday, November 27, 2024

TG – లేడీ కండక్టర్ ట్వీట్ – స్పంచిందిన సీఎం రేవంత్!

హైద‌రాబాద్ – ఉచిత బస్సు ప్రయాణాన్ని విద్యార్థినిలు ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలిపేలా ఓ మహిళా కండక్టర్ చేసిన ట్వీట్ పై సీఎం రేవంత్ స్పందించారు. ప్రస్తుతం ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉదయాన్నే పలువురు విద్యార్థినిలు మైదానానికి వెళ్లి ఆడుకునేందుకు ఉచిత బస్సును వినియోగించుకుంటున్నారని మాధవరపు రమా లక్ష్మీ (టీజీఎస్ ఆర్టీసీ కండక్టర్) ‘ఎక్స్’ వేదికగా సీఎం కి మెసేజ్ పెట్టారు. మహాలక్ష్మి పథకం ఆడపిల్లలు చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మీకు ధన్యవాదాలు సార్..అంటూ వారు బస్సులో దిగిన ఫోటోను సీఎంతో పంచుకున్నారు.

ఈ ట్వీట్‌పై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ..ఆడబిడ్డల ఆకాంక్షలను నెరవేర్చాలన్న సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ‘మహాలక్ష్మీ’ పథకాన్ని తీసుకొచ్చిందని సీఎం పేర్కొన్నారు. ఈ మహాలక్ష్ములను చూస్తుంటే.. ఆ పథకం ఉద్దేశం నెరవేరుతోందన్న విషయం అర్థమవుతోందన్నారు.చాలా సంతోషం..ఆ పిల్లలు భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదగాలని, వారి లక్ష్యాలను చేరాలని’ ఆకాంక్షించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement