Tuesday, December 10, 2024

TG – గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మతో రేవంత్‌ భేటీ

హైదరాబాద్‌: గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ బుధవారం అయ్యారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీలో సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, నేటి నుంచి ప్రారంభమైన కులగణన వివరాలను గవర్నర్‌కు సీఎం వివరించారు. ఈ ప్రక్రియకు సంబంధించి సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, సర్వే తీరు, పూర్తి స్థాయి వివరాలను గవర్నర్‌కు అందించారు.కులగణన అంశంతో తెలంగాణ దేశానికి తెలంగాణ రోల్‌ మోడల్‌గా నిలుస్తుందని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు.

సమగ్ర సర్వేను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా తన సోదరుడి కూతురు వివాహానికి గవర్నర్‌ను రేవంత్‌ ఆహ్వానించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement