Monday, December 9, 2024

TG : సీఎం రేవంత్ రెడ్డిది మిడిమిడి జ్ఞానం – కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి

గ‌వ‌ర్న‌ర్ తీరును ఆక్షేపించ‌డం అజ్ఞాన‌మే
లీగల్ ఓపినియ‌న్ కు స‌మ‌యం పడుతుంది
మీ రెండు పార్టీలు ఒక్క‌టే.. నింద‌లు మాత్రం మాపైనా
దాడి మీరు ప్రాతినిధ్యం వ‌హించే చోటే జ‌రిగింది..
వెళ్లండి..అక్క‌డి ప్ర‌జ‌ల‌తో మాట్లాడండి
సిఎం రేవంత్ రెడ్డికి కేంద్ర‌మంత్రి కిష‌న్ హిత‌వు

న్యూఢిల్లీ – సీఎం రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి.. కేసుల అనుమ‌తి ఇచ్చే విష‌యంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో కొంత జాప్యం జరిగితే తొందరపాటుగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అంతమాత్రాన బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే చెప్పడం అవివేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

కొత్త ఢిల్లీలో నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, అవినీతి ఎక్కడ జరిగినా విచారణ జరపాలన్నది మా డిమాండ్ అన్నారు. కాళేశ్వరం మీద సీబీఐ విచారణకు డిమాండ్ చేశామ‌మ‌ని, మ‌రి మీరు విచారణ కోరారా? అని రేవంత్ ను ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని తెలిపారు. వైఫల్యాలను, అసమర్ధత నుంచి దృష్టి మళ్లించేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని తెలిపారు.

ఇక‌, కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు త‌మ‌కు అవసరం లేదన్నారు. వారి హయాంలో ప్రధాని తెలంగాణకు వచ్చి ప్రాజెక్టులు ప్రారంభించడానికి వస్తే బయటకు రాని కేసీఆర్, కేటీఆర్ కు మాట్లాడే అర్హత లేదన్నారు. కలెక్టర్ మీద దాడిని ఖండిస్తున్నామ‌ని, అలాగే గ్రామస్తుల మీద అక్రమ కేసులు పెట్టడం కూడా సరికాదని అన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో ఈ జరిగిన ఘటనపై వెంట‌నే రేవంత్ స్పందించి అక్క‌డి ప్ర‌జ‌ల‌తో స్వ‌యంగా మాట్లాడాలని తెలిపారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌పై కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ, మహారాష్ట్ర, ఝార్ఖండ్ లలో బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement