Friday, October 4, 2024

TG – హైడ్రా బూచి కాదు… భద్రతకు భ‌రోసా… రంగ‌నాథ్

హైదరాబాద్ – ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉందని కమిషనర్ రంగనాథ్ అన్నారు. కేవలం అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేస్తున్నామన్నారు. ” విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ హైడ్రా బాధ్యత. ఎన్ కన్వెన్షనన్ను కూల్చివేశాం. కానీ, దానిపక్కన ఉన్న గుడిసెలను కూల్చలేదు. అమీన్ ప్పూర్లో ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతమయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హైడ్రాను బూచిగా చూపించి భయపెట్టడం సరికాదు. హైడ్రా అంటే భరోసా” అని అన్నారు.

అలాగే ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉందని రంగనాథ్ తెలిపారు. “కొన్ని కట్టడాలు కూల్చితే హైడ్రా బాగా పనిచేస్తోందని కితాబు ఇచ్చారు. ఇప్పుడేమో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేశాం. అమీన్ ప్పూర్ లో ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అయ్యాయి. అమీన్పూర్ లో ఒక ఆసుపత్రిపై అధికారులు గతంలో చర్యలు తీసుకున్నా మళ్లీ నిర్మించారు. ఆ ఆసుపత్రిని కూల్చిన సమయంలో అందులో రోగులెవరూ లేరు. వీడియోకూడా రికార్డు చేశాం. ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశాం.. దాని పక్కన ఉన్న గుడిసెలను కూల్చలేదు. ప్రజలు నివసిస్తున్న భవనాలను ఎక్కడా కూల్చలేదు.

- Advertisement -

ముందస్తు సమాచారం ఇచ్చినా కొందరు ఖాళీ చేయడంలేదు. సరైన సమయం ఇచ్చిన తర్వాతే ఆక్రమణలు కూల్చివేస్తున్నాం. ఇటీవల కూకట్పల్లి నల్ల చెరువులో ఆక్రమణలు కూల్చివేశాం. పేదలు మధ్యతరగతి ప్రజలు చెరువులు ఆక్రమించరు. అక్రమ కట్టడాల వెనుక పెద్దవాళ్లు ఉన్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే ముఖ్యమంత్రి హైడ్రాను తీసుకొచ్చారు. చెరువులు, నాలాలు కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకోం. ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు చెరువులు నాలాలను కాపాడుకోలేం. పేదలకు ఇబ్బంది చేయాలనేది హైడ్రా అభిమతం కాదు. ఒవైసీ, మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డికికి చెందిన కాలేజీలపై ఫిర్యాదులు వచ్చాయి. విద్యా సంవత్సరం నష్టపోతారనే వాటిపై చర్యలుతీసుకోలేదు. విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ హైడ్రా బాధ్యత. హైడ్రాను బూచిగా చూపించి ప్రజలను భయపెడితే భవిష్యత్ తరాలకు నష్టం జరుగుతుంది. చెరువులు, ప్రభుత్వ భూములను ఎవరూ కాపాడలేరు. జన్వాడ ఫామ్ హౌస్ 111 జీవో పరిధిలో ఉంది. 111 జీవో హైడ్రా పరిధిలోకి రాదు అని రంగనాథ్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement