Friday, October 4, 2024

TG – కాంగ్రెస్ వైపు ఆర్‌.కృష్ణ‌య్య అడుగులు – ఎంపీ మ‌ల్లు ర‌వితో భేటీ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు ఆర్‌.కృష్ణ‌య్య‌తో కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లు ర‌వి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్ద‌రు నేతలు చర్చించినట్లు సమాచారం. వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగిన ఆర్‌.కృష్ణ‌య్య మంగ‌ళ‌వారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం విదిత‌మే. ఈ నేపథ్యంలో కృష్ణయ్యతో మల్లు రవి సమావేశం కావడం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

కాంగ్రెస్ లోకి కృష్ణ‌య్య‌
రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు ఆర్‌.కృష్ణ‌య్య కాంగ్రెస్‌లోకి చేరే అవ‌కాశం ఉంద‌ని ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. కుల గణన ఉద్యమాన్ని బలోపేతం చేయడానికే ఎంపీ పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌.కృష్ణయ్య ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. బీసీ ఉద్యమం గ్రామ స్థాయికి చేరిందన్నారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల పెంపును సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement