Friday, October 4, 2024

TG – ప్రతీ జిల్లాలో స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీలు – మంత్రి పొంగులేటి

హైదరాబాద్ – యువత భవిత కోసం తమ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. యూసఫ్ గూడ నిమ్స్ మే లో నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్వల్ప కాలిక శిక్షణ పథకం కింద స్వచ్ఛత హి సేవా ఈవెంట్ నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. నిరుద్యోగులకు నైపుణ్య విద్యనందించడానికి ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ యువకులకు స్కిల్ పెంపొందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యంగా చెప్పారు. ఈ ధ్యేయంతో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీ స్థాపించిందన్నారు.

- Advertisement -

ఇందులో 17 రకాల సర్టిఫికెట్, డిప్లోమో, డిగ్రీ కోర్సులను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రతీ జిల్లాలో స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీ ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఆధునిక పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా ఏటీసీలలో యువతకు శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను టీటీఎల్ నియమిస్తుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement