Thursday, November 7, 2024

TG – మ‌రోసారి ఉరికించి కొట్ట‌డం ప‌క్కా…..

అంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైదరాబాద్‌ నడిబొడ్డున తిరుగుతున్నా.. ఎక్కడికి రమ్మంటావో చెప్పు అంటూ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ కు సవాలు విసిరారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి . గ‌తంలో లక్ష్మారెడ్డి, సుధీర్‌ రెడ్డి ఉప్పల్‌లో ఉరికించింది మరిచిపోయావా అని ప్రశ్నించారు. ఇదే విధంగా మాట‌లు జారితే మ‌రోసారి ఉరికించి కొట్ట‌డం ఖాయ‌మ‌న్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద శనివారం నాడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. శాసనసభలో దానం నాగేందర్‌కు ముఖ్యమంత్రి మైక్‌ ఇప్పించి తమను తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో దానం సంస్కారం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. నిరుద్యోగుల కోసం తాము కొట్లాడుతుంటే, ఆయ‌న‌ నీచమైన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. దానం మాటలన్నీ నిరుద్యోగులను ఉద్దేశించినవేనని చెప్పారు. ఆ ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేశారు. దానంకి ఎమ్మెల్యే పదవి కేసీఆర్‌ పెట్టిన భిక్ష అని లిపారు. సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి ఆయ‌న‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చింది మేమే…

దేశంలో 2లక్షల 2 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్‌ మాత్రమేనని అన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఆయన తెలిపారు. తన సవాలుకు కాంగ్రెస్‌, బీజేపీ నోరు మెదపడం లేదని విమర్శించారు. కేసీఆర్‌ ఇచ్చిన 30వేల ఉద్యోగాలు కూడా సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. సిగ్గులేకుండా రేవంత్‌ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.

- Advertisement -

అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాబ్‌ క్యాలెండర్‌పైనా మాట్లాడుతూ, జాబ్‌ క్యాలెండర్‌లో ఉద్యోగ ఖాళీల వివరాలు లేవని ఆయన అన్నారు. జాబ్‌ క్యాలెండర్‌పై ఎవరి సంతకం లేదని పేర్కొన్నారు. తేదీలు, ఉద్యోగ ఖాళీలతో జాబ్‌ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement