Saturday, December 7, 2024

TG – కొంగాల వాటర్ ఫాల్స్ లో ఒకరు గల్లంతు

వాజేడు అక్టోబర్ 6 ప్రభ న్యూస్ : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని కొంగాల వాటర్ ఫాల్స్ లో వ్యక్తి గల్లంతైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. కొంగాల వాటర్ ఫాల్స్ కు సందర్శించేందుకు అనుమతి లేనప్పటికీ కొందరు వ్యక్తులు పర్యటకులు దొంగతనంగా అక్కడికి వెళుతున్నారు.

ఈ తరహాలో అక్కడికి వెళ్లిన వ్యక్తి కొంగల వాటర్ ఫాల్స్ లో స్నానం చేస్తూ గల్లంతు అయ్యాడు. ఇది తెలుసుకున్న స్థానిక వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ గాలింపు చర్యలు చేపట్టారు కానీ గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఇంకా లభించలేదు పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement