Friday, December 6, 2024

TG – యాదాద్రి నరసింహస్వామి సేవలో మంత్రులు

యాదాద్రి ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు. శుక్రవారం రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, విప్ బిర్లా ఐలయ్య, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు లు ఆలయానికి రాగా ఆలయ కమిటీ మరియు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

అనంతరం లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాల సాక్షిగా ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement