Tuesday, November 12, 2024

TG : మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నేత‌గా మ‌ధుసూద‌న‌చారి

బాధ్య‌త‌ల స్వీక‌రించిన ఎమ్మెల్సీకి కేటీఆర్ గ్రీటింగ్స్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : శాస‌న మండ‌లి ప్ర‌తిప‌క్ష నేతగా ఎంపికైన బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ మ‌ధుసూద‌న‌చారి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా మ‌ధుసూద‌నాచారికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం శాలువాతో స‌త్క‌రించారు.

కేటీఆర్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మ‌ధుసూద‌నాచారి
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నూత‌నంగా శాస‌న మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌గా నియ‌మితులైన మధుసూద‌నాచారి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ను అంకిత‌భావంతో నిర్వ‌ర్తిస్తాన‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా శాస‌న‌మండ‌లి తొలి చైర్మ‌న్ స్వామిగౌడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, స‌న‌త్ న‌గ‌ర్ ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్సీలు మ‌ధుసూద‌నాచారికి శుభాంక్ష‌లు తెలిపి, శాలువాల‌తో స‌త్క‌రించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement