Tuesday, December 3, 2024

TG – లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ – భూసేకరణకు నోటిఫికేషన్

హైదరాబాద్ – లగచర్లలో ఫార్మా విలేజ్ స్థానం లో ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.. దుద్యాల మండలంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈక్రమంలో మండలంలోని లగచర్లలో 110.32 ఎకరాలు, పోలేపల్లిలో 71.39 ఎకరాల భూసేకరణ కోసం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు.

రైతులు, స్థానికుల ఆందోళనల నేపథ్యంలో అంతకుముందు ఇక్కడ ఫార్మా విలేజ్ కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ను ఈ నెల 27న ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement