Wednesday, December 11, 2024

TG – పెట్టుబడి సాయం ఎగ్గొట్టడమే రైతులకు రేవంత్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. – కేటీఆర్

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం పెట్టుబడి సాయం ఎగ్గొట్టడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. చేతకాని హామీలు ఇవ్వడమెందుకు, అధికారంలోకి వచ్చాక చేతులెత్తేయడం ఎందుకని ప్రశ్నించారు. ఈ మేరకు నేడు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.అడ్డగోలు నిర్ణయాలతో అన్నదాతను ఆగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంతోషంగా సాగిన వ్యవసాయాన్ని సంక్షోభంగా మార్చారని విమర్శించారు. నిన్న వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టారు, నేడు యాసంగి పెట్టుబడి సాయానికి పాతరేస్తారట అని ఫైరయ్యారు. దగా పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రైతులకు రేవంత్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అని నిలదీశారు.

కాంగ్రెస్ పాలనలో ఇంతకంటే దిక్కుమాలిన ఆలోచన ఇంకొకటి ఉంటదా అని విమర్శించారు. రేవంత్ ఏడాది ఏలికలో తెలంగాణ రైతుకు గోస తప్ప భరోసా లేనే లేదని ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ఎవరేంటో మరోసారి తేలిపోయిందని చెప్పారు.

బీఆర్ఎస్ నినాదం, విధానం జై కిసాన్ అని, కాంగ్రెస్ పాలసీ ఎప్పటికీ నై కిసానే అని మండిపడ్డారు.’

- Advertisement -

‘నిన్న వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టారునేడు యాసంగి పెట్టుబడి సాయానికి పాతరేస్తారట ?దగా పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రైతులకు రేవంత్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా ?కాంగ్రెస్ పాలనలో.. ఇంతకంటే దిక్కుమాలిన ఆలోచన ఇంకొకటి ఉంటదా ?రేవంత్ ఏడాది ఏలికలో.. తెలంగాణ రైతుకు గోస తప్ప.. భరోసా లేనే లేదు ?వానాకాలం పెట్టుబడి సాయానికి మోక్షం లేదుయాసంగి రైతుభరోసాకు దారే కనిపించడం లేదు2 లక్షల రుణమాఫీ పేరిట దగాచేశారు..ఇక రైతుబంధును కూడా ఎత్తేస్తారా ??ఇలాగైతే తెలంగాణలో సాగు సాగేదెలా..?ఏడాదిలోనే బక్కచిక్కిన రైతు బతికేదెలా..??సిగ్గు లేని కాంగ్రెస్ పార్టీ..చేతకాని హామీలు ఇవ్వడమెందుకు ?అధికారంలోకి వచ్చాక చేతులెత్తేయడం ఎందుకు ??అడ్డగోలు నిర్ణయాలతో అన్నదాతను ఆగం చేశారు. సంతోషంగా సాగిన వ్యవసాయాన్ని సంక్షోభంగా మార్చారుమరోసారి ఎవరేంటో తేలిపోయింది..బీఆర్ఎస్ నినాదం.. విధానం.. జై కిసాన్కాంగ్రెస్ పాలసీ ఎప్పటికీ.. నై కిసానే” అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement