Monday, December 9, 2024

TG – ఆటోలో ద‌ర్నాకు కెటిఆర్ ..

హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో నేడు ప్రయాణించారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల మహా ధర్నా ప్రాంతానికి ఆయన ఆటోలో చేరుకున్నారు. కేటీఆర్ మొదట నందినగర్‌లోని తన నివాసం నుంచి కారులో బయలుదేరారు. ఆ తర్వాత కొందరు సీనియర్ నాయకులతో కలిసి ఆటో ఎక్కిన కేటీఆర్ మహాధర్నా వద్దకు చేరుకున్నారు. ఆటో డ్రైవర్‌తో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు. ఆయన ఆటోలో కూర్చొని వెళుతుండగా కొంతమంది కార్యకర్తలు, అభిమానులు ఆయనతో సెల్ఫీ తీసుకోవడానికి పోటీపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement