Friday, October 4, 2024

TG నేడు మూసీ పరివాహక ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటన

హైదరాబాద్ – అనారోగ్యం నుంచి కోలుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మళ్లీ ప్రజల్లోకి వెళ్లనున్నారు. నేడు మూసీ పరివాహక ప్రాంత బాధితుల దగ్గరకు వెళ్లనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు..

ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్ గూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన ఉంటుంది. అనంతరం అత్తాపూర్ లోని కిషన్ బాగ్ ప్రాంతాల్లోని ప్రజలతో భేటీ కానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

లీగల్ నోటీస్ పంపినా ..

- Advertisement -

ఇక అటు బావమరిదితో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తా అనుకుంటున్నావా ? అంటూ రేవంత్‌ పై ఆగ్రహించారు కేటీఆర్‌. బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్ లోనే ఆయన బావమరిది శోద కంపెనీకి ₹1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement