Friday, November 29, 2024

TG – బకాయిలు చెల్లించమంటే అరెస్ట్ చేస్తారా – రేవంత్ ప్రభుత్వం పై కేటీఆర్ ఫైర్

హైదరాబాద్ – రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులు అరెస్టు చేయడాన్ని తప్పు పట్టారు బి అర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతా లో ట్వీట్ చేసారు

పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహించారు. తెలంగాణ రాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వమే కొనసాగుతోంది- పోలీసులతో సమస్యలను అణగదొక్కాలని చూస్తుంది ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు

తెలంగాణ రాష్ట్రంలోని సమస్యలు గాలికి వదిలి ముఖ్యమంత్రి, మంత్రులు ఊరేగుతున్నారని చెప్పారు. సర్పంచుల కుంటుంబాలు రోడ్డున పడే దాకా ప్రభుత్వం స్పందించదా ? అని నిలదీశారు.

శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సర్పంచులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. పల్లె ప్రగతి పేరిట తాము చేపట్టిన కార్య క్రమాననికి తూట్లు పొడిచి నిధులు విడుదల చేయకుండా ఆపుతున్నారని ఫైర్ అయ్యారు కేటీఆర్.

- Advertisement -

అటు హరీష్ రావు కూడా దీనిపై స్పందించారు. అరెస్ట్ చేసిన సర్పంచ్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement