Tuesday, December 3, 2024

TG – గురుకులాల్లో పాయిజ‌న్ కుట్ర ప్ర‌వీణ్ కుమార్ దే – మంత్రి కొండా సురేఖ

హైద‌రాబాద్ – గురుకులాల్లో ఫుడ్ పాయిజినింగ్ ఘ‌ట‌న‌ల వెనుక కుట్రల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పని చేశారని గుర్తు చేశారు. తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నట్లు చెప్పారు. త‌న అనుచ‌రుల‌తోనే ఇటువంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డుతూ, కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేస్తున్నార‌ని ఆరోపించారు. హైద‌రాబాద్ లో ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ, సంక్షేమ హాస్టళ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో హాస్టళ్లలో భోజనంలో పురుగులు వచ్చేవన్నారు. సంక్షేమ హాస్టళ్లలో సదుపాయాలు కొరవడినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.

తమ ప్రభుత్వం వచ్చాక హాస్టల్లో ఓ విద్యార్థిని చనిపోయిందన్నారు. బాధిత విద్యార్థినికి ప్రత్యేక వైద్య సదుపాయం అందించామన్నారు. దురదృష్టవశాత్తూ చనిపోయిందన్నారు. ఆమె మృతిపై రాజకీయం చేయవద్దని కోరారు. హాస్టళ్లలోని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.

- Advertisement -

కేటీఆర్ పదేపదే జైలుకు పోతా అంటున్నారు

కేటీఆర్ ఏదో తప్పు చేసినట్లున్నార‌ని, అందుకే జైలుకు పోతానని పదేపదే అంటున్నార‌ని మంత్రి కొండా అన్నారు. గిరిజనుల కోసం, . మూసీ నది కోసం జైలుకు పోతానని కెటిఆర్ అంటున్నార‌ని, అయితే తాను చేసిన తప్పులకు జైలుకు పోతానని కేటీఆర్‌కు తెలుసి ప్రజల కోసం జైలుకు పోతానని అంద‌ర్ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. బీఆర్ఎస్ హయాంలో తాను కూడా ఎమ్మెల్యేగా ఉన్నానని, కానీ కేసీఆర్ , కేటీఆర్ ఎప్పుడైనా ఎమ్మెల్యేలను కలిసి సమస్యలు విన్నారా? అని ప్రశ్నించారు. కనీసం వారు మంత్రులకు కూడా దొరకలేదని విమర్శించారు. కానీ ఈరోజు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజలు ఐదేళ్లు పాలించాలని అధికారం ఇస్తే ప్రభుత్వాన్ని దింపుతానని సైకోరావు అనడం విడ్డూరమని కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement