Thursday, November 7, 2024

TG – రుణ‌మాఫీపై హ‌రీశ్‌రావుకు మాట్లాడే అర్హ‌త లేదు – మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : రుణ‌మాఫీ గురించి మాట్లాడే క‌నీస అర్హత బీఆర్ ఎస్ నేత‌, సిద్ధిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావుకు లేద‌ని రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి అన్నారు. బుధ‌వారం గాంధీ భ‌వ‌న్‌లో తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్ అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హిస్తున్న స‌మావేశానికి ఆయ‌న హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రంలో విప‌క్షాలు కేవ‌లం ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డ‌మే ధ్యేయంగా ఉన్నార‌ని అన్నారు.

బీసీ గ‌ణ‌న‌ తెలంగాణ‌లో చ‌రిత్ర సృష్టించ‌బోతోంది
బీసీ కులగణన తెలంగాణలో చరిత్ర సృష్టించబోతోంద‌ని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. బీసీ కులగణన జరగాలన్న హామీకి తామంతా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement