Wednesday, November 6, 2024

TG I ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

చెన్నూర్ ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి వివిధ మండలాల నుంచి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. సిఎస్ఆర్ నిధులతో ఆసుపత్రికి మంజూరైన రెండు 108 అంబులెన్సలను గురువారం ఉదయం వివేక్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నూరు, కోటపెల్లి, వేమనపల్లి మండలాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రి అభివృద్ధికి మరింత కృషి చేస్తామని, గ్రామీణ ప్రాంతాల ప్రజలు అత్యవసర సమయంలో వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్ లు అవసరమని మరో రెండు అంబులెన్స్ లను ప్రభిస్తమన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చెర్ పర్సన్ అర్చనగిల్డా,వైద్యులు సత్యనారాయణ, అరుణశ్రీ, సిబ్బంది కాంగ్రెస్ నాయకులు చెన్న సూర్య నారాయణ, పాతర్ల నాగరాజు, మహేష్ ప్రసాద్ తివారీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement