Wednesday, November 27, 2024

TG – బెంగళూరులో ‘హైడ్రా’ బృందం..

హైదరాబాద్ – బెంగళూరులో చెరువుల పునరుజ్జీవనంపై క్షేత్ర స్థాయిలో స్థితిగతులను అధ్యయనం చేయడం, మురుగునీరు స్వచ్ఛంగా మార్చడం, డిజాస్టర్ మేనేజ్మెంట్లో అనుసరించిన విధానాలను పరిశీలించేందుకు కమిషనర్ ఏవీ రంగనాథ్ సారథ్యంలోని ‘హైడ్రా’ బృందం రెండు రోజుల పాటు బెంగళూరులో పర్యటించనుంది. ఈ మేరకు ఇప్పటికే ఈ బృందం బెంగళూరుకు చేరుకుంది.

అక్కడ చెరువులను అధ్యయనం చేసి హైదరాబాద్ మహానగర పరిధిలో ఉన్న బాచుపల్లిలోని ఎర్రగుంట చెరువు, మాదాపూర్లోని సున్నంచెరువు, కూకట్‌పల్లిలోని నల్లచెరువు, రాజేంద్రనగర్లోని అప్పచెరువులకు పునరుజ్జీవం కల్పించనున్నారు.

అదేవిధంగా భారీ వర్షాలు పడినప్పుడల్లా హైదరాబాద్ మహానగరాన్ని వరద నీరు ముంచెత్తడం, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు బెంగళూరు డిజాస్టర్ మేనేజ్మెంట్ నిపుణులతో ‘హైడ్రా’ అధికారులు సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement